టాపిక్ డైవర్టెడ్ – బాబు సక్సెస్..!

Friday, November 2nd, 2018, 11:00:40 AM IST

ప్రజల దృష్టిని ఒక అంశం మీద నుండి ఇంకో అంశం మీదకి మరల్చి పరిస్థితి తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఏపీ సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా, తనకు వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్నైనా రాజకీయ తెర పై నుండి ఇట్టే మాయం చేయగలరు బాబు. అయన 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర చూస్తే అడుగడునా అవకాశవాద రాజకీయాలే, ఇందులో ఆయనకు తన అను”కుల” మీడియా మద్దతు కూడా బాగానే ఉంది. గత వారం రోజులుగా జగన్ హత్యాయత్నం ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది, అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేసింది. బాబు ఎంత డిఫెన్స్ చేసుకున్నా ఈ దాడి వెనక టీడీపీ హస్తం ఉందన్న విషయం జనంలోకి బలంగా వెళ్ళింది. ఈ అంశాన్ని జనం మెదళ్ళలోంచి మాయం చేయాలంటే ఇంతకంటే పెద్ద అంశం తేరా మీదకు తేవాలి, అందుకే బాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది.

ఆ ప్రణాళిక ప్రకారం ఢిల్లీ వెళ్లిన బాబు నేషనల్ మీడియా ముందు జాతీయ కూటమి, సేవ్ నేషన్ అంటూ హడావుడి సృష్టిస్తున్నాడు. అందులోను చేతిలో అనుకూల మీడియా ఉంది, దీంతో కొన్నిరోజుల పాటు జనం నోళ్ళలో నానుతున్న జగన్ హత్యాయత్నం అంశం మరుగున పడింది. బాబు వ్యూహం ఫలించింది, జాతీయ మీడియా సైతం రోజంతా టీడీపీ, కాంగ్రెస్ ల కలయిక గురించే డిబేట్ లు, డిస్కషన్ లు పెట్టింది. చివరకు జగన్ మీడియా సంస్థ అయిన సాక్షికి కూడా బాబు ఢిల్లీ టూర్ గురించి చర్చ పెట్టక తప్పలేదు, ఇక బాబు అనుకూల మీడియా సంగతి సరే సరి.మొత్తానికి కొన్ని రోజుల పాటు బాబు ఢిల్లీ టూర్ గురించే వార్తలు, చర్చలు చూడాల్సి వస్తుందన్నమాట. మరో వైపు ఢిల్లీలో జగన్ ప్రతిపక్ష పార్టీల మాట సాయం కూడా లేకుండా చేయటంలో బాబు విజయం సాధించి “40ఇయర్స్ ఇండస్ట్రీ” అనిపించుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments