వైసీపీ,టీడీపీ పొత్తు..బాబు నిన్న అలా ఈ రోజు ఇలా.!

Tuesday, February 12th, 2019, 05:39:10 PM IST

నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి వ్యతిరేఖంగా చేసిన పోరాట దీక్ష సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ దీక్షలో జగన్ ను మరియు వైసీపీ పార్టీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తునే సంచలనానికి తెర లేపింది.ఒక న్యూస్ ఛానెల్ కి సంబందించిన విలేఖరి మీరు వైసీపీతో కలిసి పని చేస్తారా అంటే చంద్రబాబు నిర్మొహమాటంగా వారు వస్తే కలిసి పని చేసేందుకు ఎలాంటి అభ్యంతరము లేదని తేల్చి చెప్పసారు.

నిన్న చంద్రబాబు చేసిన ఈ మాటలు ఒకెత్తు అయితే చేసినటువంటి మాటలు ఒకెత్తు నిన్న చంద్రబాబు అలా అనేసరికి ఒక పక్క టీడీపీ మరియు వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.దానితో చంద్రబాబు ఈ రోజు ప్లేట్ తిప్పేశారు.అలాంటి అవినీతి పరులని పార్టీలోకి ఎవరు చేర్చుకుంటారని,జగన్ ఒకవేళ తమకి సపోర్ట్ చేస్తే చేసుకోమని చెప్పానని అంతే కానీ తాను వస్తే చేర్చుకునే మనుషులు ఎవరు లేరని సంచలన వ్యాఖ్యలు చేసారు.