చంద్రబాబు దొరికిపోయాడా..?

Saturday, November 17th, 2018, 12:40:38 PM IST

ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆందోళన చెందుతూ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సిబిఐ విచారణ చెయ్యాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లయింది. చంద్రబాబు ఎక్కడో కేంద్రానికి దొరికిపోయాడు అన్న అనుమానాలు నిజమే అనిపిస్తుంది, రాబోయేది చంద్రబాబుకు గడ్డు కాలమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

గత కొద్దికాలంగా చంద్రబాబు జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేయాలనీ దేశం అంతా తిరుగుతున్నారు, దీని వెనక అసలు కారణం వేరే ఉందని, కేంద్రం నుండి తనను తానూ కాపాడుకోవటం కోసం బాబు ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది. టీడీపీ కి సంబందించిన ఇద్దరు ముగ్గురు రాజ్యసభ సభ్యులు కొద్దిరోజులుగా ఢిల్లీలో ఉంటూ బాబుని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఎదో జరగబోతుందన్న భయాందోళనలు బాబులో ఎక్కువయ్యాయని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, అయినప్పటికీ సీబీఐని నియంత్రిస్తూ, బాబు తీసుకున్న నిర్ణయం చెల్లదని న్యాయ నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. చంద్రబాబు ఆందోళన వెనక ఉన్న కారణం త్వరలోనే బయటపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.