చంద్రబాబుకి గుడి కట్టేస్తున్నారండోయ్..

Tuesday, June 26th, 2018, 04:29:44 PM IST

పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాయుడు మాత్రం తన ప్రణాళికలతో ముందుకు సాగుతూనే వున్నారు. ఇప్పటికే నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పార్టీ అపరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇకపోతే రీసెంట్ గా హిజ్రాలు చంద్రబాబుపై వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఏకంగా సీఎం కు గుడి క్యాట్ కట్టిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబుకి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

హిజ్రాలకు ప్రత్యేకంగా చంద్రబాబు తెల్ల రేషన్ కార్డులను అలాగే 1500 పెన్షన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు గాను కృతజ్ఞతతో హిజ్రాలు ఆలయ నిర్మాణానికి సిద్ధమయ్యారు. 10 కేజీల వెండితో చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. అయితే ఈ ఆలయానికి ఈ ఉదయం
నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రి అఖిలప్రియ శంఖుస్థాపన నిర్వహించారు. స్థానిక నేతల సహాయంతో ఈ గుడిని హిజ్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.