హ్యట్సాఫ్ చంద్రన్నా: టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందనడానికి ఇదే నిదర్శనం..!

Saturday, May 18th, 2019, 01:30:07 AM IST

ఏపీలో మొన్న జరిగిన సారత్రిక ఎన్నికలలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నా పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే కనపడుతుంది. అయితే ఇప్పటికే వెలువడిన సర్వేలలో చలా సర్వేలు వైసీపీదే విజయమని చెబుతున్నా, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీదే విజయమని చెబుతున్నాయి. అయితే ఈ ఇరు పార్టీలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. అయితే ఆ సర్వేలని, ఈ సర్వేలని వైసీపీదే అధికారమని రోజుకొక పుకారులు వస్తున్నా టీడీపీ అధినేత చంద్రన్న కళ్లలో మాత్రం గెలుపు ధీమాను తగ్గించలేకపోతున్నాయి. ఆయన ఆత్మస్థైర్యం ముందు అవేమి నిలబడలేకపోతున్నాయి.

అయితే వైసీపీ నేతలు గెలుపు మాదే అని, చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వైసీపీ ప్రచారం చేస్తుంది. అయితే చంద్రబాబుపై ప్రజల్లో ఏం వ్యతిరేకత ఏర్పడింది, ఆయన ఈ ఐదేళ్ళలో అసలు ఏం చేశాడు అనేది తెలిసిన వారికి మాత్రం బాబు గారిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అయితే అసలు చంద్రబాబు ఏం చేసాడో ఒకసారి వెనక్కివెల్ళి చూస్తే ఈ ఐదేళ్ళు ఆయన రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా తన కుటుంబ సభ్యులతో కాలం గడపలేదు. ఎన్నికలకు ముందు నాలుగు నెలలు కష్టపడితేనో లేక యాగాలు, పూజలు చేస్తే గెలుస్తాములే అని తాగి ఇంట్లో పడుకోలేదు. రాష్ట్రంలో కూర్చుని అనవసర రాజకీయాలు చేయకుండా దేశ దేశాలకు తిరిగి రాష్ట్రంలోకి వివిధ కంపెనీలను ఆహ్వానించి ప్ట్టుబడులను తీసుకువచ్చాడు. తనపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజలను మోసం చేయకుండా ఐదేళ్ళుగా వారి సంక్షేమానికై కృషి చేస్తూనే ఉన్నాడు. తన సొంత కుటుంబాన్ని కూడా పక్కకి పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరగకుండా కష్టపడ్డాడు. దురుద్దేశంతో కేసులేసి అభివృద్ధిని అడ్డుకున్నవాళ్లతో కూడా సహనంతోనే పోరాడాడు. ప్రయాణాల సమయంలోనే నిద్రపోతూ, సమావేశాల మధ్యలోనే భోజనం చేస్తూ 70 ఏళ్ల వయసులో కూడా యువ నాయకుడిలా రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేసుకున్నాడు.

అంతేకాదు వరుస తుఫానులు రాష్ట్రాన్ని భయపెడుతున్నా మోకాలి లోతు నీటిలో తానే స్వయంగా వెళ్ళి బాదితులను పరామర్శించి ఆదుకున్నాడు. ఆడపడుచులకు తోడబుట్టిన అన్నలాగా పసుపు కుంకుమ అందించాడు. వృద్ధులకు, వికలాంగులకు తానే పెద్ద కొడుకై అండగా నిలబడ్డాడు. నేడు రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వచ్చాయన్నా, నీటి ప్రాజెక్టులు ఇంత వేగంగా పూర్తయ్యేదశకి చేరుకున్నయన్నా దాని వెనుక చంద్రన్న కృషి ఎంతలా ఉందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు రాయలసీమకు నీరందించడం ఏళ్ళ నుంచి ఎవరికి సాధ్యం కాని అసాధ్యమైన పనిని సుసాద్యం చేసి చూపించారు. ఎడారి లాంటి భూములను కృష్ణమ్మతో పులకరింపచేసారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చిరునామాగా అమరావతిని నిలపాలని రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. పేద ప్రజలకు ఇళ్ళు, ఉచిత వైద్యం, రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ఈ ఐదేళ్ళలో మనకు పరిచయం చేసిన మహనీయుడు మన చంద్రన్న.

ఇలా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎన్నో చేసిన చంద్రన్న పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్న వైసీపీని చూస్తుంటే సిగ్గు చేటుగా ఉంది. వైసీపీ ఎన్ని చెప్పినా అభివృద్ధిని, అందిన సాయాన్ని మరిచిపోవడానికి ఆంధ్ర ప్రజలేమి మీలా అవివేకులు కాదని టీడీపీ శ్రేణులు అంటున్నారు . ఈ సారి జరిగిన ఎన్నికలలో కూడా ప్రజలందరూ చంద్రన్న వైపే ఉన్నారని అది వైసీపీకి తొందరలోనే అర్ధమవుతుంది. మే 23 న వెలువడే ఫలితాలను చూసి పసుపు జెండా రెపరెపలదాటికి ఫ్యాన్ రెక్కలు విరిగి పోవడం ఖాయంగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నారట.