పవన్ దీక్షకు పరోక్షంగా ఆన్సర్ ఇచ్చిన చంద్రబాబు

Sunday, May 27th, 2018, 03:55:08 AM IST

ప్రస్తుతం జనసేన నాయకుడు పవన్ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాడు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం బాధితుల కోసం నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వెంటనే ఉద్దానం బాధితులను ఆదుకోవాలని ఇప్పటికే హెచ్చరించిన పవన్ ప్రస్తుతం ప్రశాంతగా దీక్షను కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం సహాయాన్ని అందించేవరకు తాను దీక్ష విరమించేది లేదని చెప్పాడు.

అయితే పవన్ దీక్షకు పరోక్షంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. అన్ని పనులు జరుగుతున్నట్లు చెప్పాడు. ఇంకా ఏమన్నారంటే.. ‘ఉద్దానం సమస్యపై ప్రత్యేక చొరవతో కార్యక్రమాలు చేపడుతున్నాము. గత ఏడాది జనవరి నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉద్దానం 7 మండలాల్లోని 176 గ్రామాల్లో స్క్రీనింగు నిర్వహించి 1,01,593 మందిలో రుగ్మతలను గుర్తించారు. వారిలో 13,093 మందిని కిడ్నీ సంబంధిత వ్యాధి పరీక్షలకు సిఫారసు చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి దగ్గరలోనే డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యాన్ని చేరువ చేస్తున్నాం.

శ్రీకాకుళం రిమ్స్‌లో 16, టెక్కలి ఏరియా ఆసుపత్రిలో 8, పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 5, పలాస సామాజిక ఆసుపత్రిలో 8, సోంపేట సామాజిక ఆసుపత్రిలో 12 డయాలిసిస్ మిషన్లను ఏర్పాటు చేసాము. క్రానిక్ కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనుటకు పరిశోధన మొదలైంది. ఉద్దానం ప్రాంతంలోని 18 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందిస్తున్నాం. గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ, సాదికార మిత్రలతో గ్రామ స్ధాయి కమిటీని నియమించి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పీ పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments