బాబు ఎన్టీఆర్ ను నెత్తిన పెట్టుకొని తీరాల్సిందే !

Friday, September 14th, 2018, 11:22:20 AM IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని నెలకొల్పిన నందమూరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే కునుకు ఎన్నో ఏళ్లుగా అభిమానుల్లో ఉంటూనే ఉంది. 2014 ఎన్నికలకి వియ్యంకుడు బాలకృష్ణకు పార్టీలో సముచిత స్థానం కల్పించి ఆ నిందను చంద్రబాబు కొంత తగ్గించుకునే యత్నం చేసినా 2009 ఎన్నికల ఓటమి తరవాత జూ.ఎన్టీఆర్ ను ఆయన విస్మరించిన తీరు, అన్నగారి పెద్దకుమారుడు హరికృష్ణను పక్కనబెట్టిన విధానం ఇప్పటికీ అభిమానుల్ని తొలుస్తూనే ఉన్నాయి. అయినా ఆ కోపాన్ని పార్టీ మీద ఎప్పుడూ చూపలేదు వాళ్ళు.

కానీ ఈ మధ్యే సంభవించిన హరికృష్ణ అకాల మరణంతో పార్టీలో నందమూరి మూడవ తరం వారసుల హక్కు ఎంత అనే అంశం తెర మీదికి వచ్చింది. అంతేకాదు పార్టీలో హరికృష్ణ స్థానాన్ని ఎన్టీఆర్ కు కట్టబెట్టి రాబోయే ఎన్నికల పన్నుల్లో భాగస్వామిని చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు కూడ తేదేపా వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఒకవేళ ఇదే నిజమై బాబు తారక్ కు పార్టీ కండువా కప్పి తెలంగాణలో లేదా ఆంధ్రలో ఎక్కడ ప్రచారం చేయించినా, ఆ ప్రచార ఫలితం ఎలా ఉన్నా ఇంకో ఐదేళ్ల పాటు ఆయన్ని గారాబంగా చూసుకొని తీరాలి, చినబాబు లోకేష్ కు పార్ట్ వ్యవహారాల్లో ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం ఎన్టీఆర్ కూ ఇవ్వాలి, ఒకరకంగా అతన్ని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలి. అలా కాకుండా 2009లో చేసినట్టు పనైంది కదా పక్కనబెట్టు అనే ఫార్ములాను ఫాలో అయితే మాత్రం అభిమానుల నుండి పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొని, ప్రజాదరణ కలిగిన వారసుడికి చిరకాలం దూరంకాక తప్పదు. మరి బాబు ఎన్టీఆర్ ను టచ్ చేసి నెత్తిన పెట్టుకుంటారో లేకపోతే అసలు ఆయన జోలికే వెళ్లరో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments