చంద్రబాబు పెద్ద అవకాశవాది : వైఎస్ జగన్

Tuesday, May 29th, 2018, 05:22:19 PM IST

ప్రజాపోరాట యాత్రలో భాగంగా నేడు 175వ రోజు యాత్రను వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వీరవాసంలో జరుగుతోంది. కాగా ఆయన తలతాడితిప్ప-మంథెనపూడి క్రాస్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ మహానాడులో చంద్రబాబు సహా మిగతా నేతలందరూ మోసపూరిత తీర్మానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండి పడ్డారు. కాగా మహానాడులో టిడిపి ఒకవేళ రానున్న ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వస్తే అక్కడ 12 మంది బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలకు చెందిన మహిళలను తమ మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటనను జగన్ దుయ్యబట్టారు. అసలు నీతి, నిజాయితీ అనేవి మీకు కొంతైనా వున్నాయా, ఇక్కడ అధికారంలో వున్న మీరు ఎస్సి, ముస్లింలకు ఒక్క మంత్రిపదవి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.

అసలు తెలంగాణాలో టిడిపి పని ఎప్పుడో అయిపోయిందని, అక్కడ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిసి చంద్రబాబు ఈ విధంగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మరి అటువంటి తీర్మానాలు ఏపీలో చేయొచ్చుకదా అని అడిగారు. చంద్రబాబు ఏపీపై ఒకలా, తెలంగాణపై ఒకలా కపట ప్రేమ కురిపిస్తూ తమకు నచ్చిన విధంగా ప్రకటనలను చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కావున ప్రజలు ఇకనైనా ఆయన కుటిల బుద్ధిని గ్రహించి రానున్న ఎన్నికల్లో ఓటు అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పి ఆ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అసలు మహానాడులో చెపుతున్న విషయాలు, చేస్తున్న తీర్మానాలు పాచి అబద్ధాలని, కేవలం తమ కులస్తులకు మాత్రమే బాబు పెద్ద పీత వేస్తున్నారని ఎద్దేవా చేశారు……

  •  
  •  
  •  
  •  

Comments