బాబు గారూ, రాష్ట్రానికి ప్యాకెజీ తీసుకోవడానికి మీరెవరు : జగన్

Sunday, July 29th, 2018, 11:59:59 AM IST

వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్రను దిగ్విజయంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన యాత్ర కాకినాడ మండలం జగ్గం పేటలో సాగుతోంది. కాగా అయన యాత్రలో అధికార టిడిపి అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చెరుగుతున్నారు. ఓవైపు కేంద్రం వారు మీ రాష్ట్రానికి ఇవ్వవలసినవన్నీ కూడా ఇవ్వడం జరిగిందని లెక్కలు చెపుతుంటే, బాబు ప్రభుత్వం మాత్రం మాకేమి ఇవ్వలేదని బుకాయిస్తోందని విమర్శించారు. హోదా ఆయనే కావాలంటే, మల్లి హోదా బదులు ప్రత్యేక ప్యాకెజీ తీసుకుందాం దానివల్ల రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది అంటారు. మళ్లి ఆయనే రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్యాకెజీ నిధులను తీసుకుని, కేంద్రం వారు మాకేమీ ఇవ్వలేదు,

కాబట్టి మాకు హోదానే కావాలంటారు, అంటూ చంద్రబాబును ఎద్దేవా చేసారు. అసలు ఎంతో నష్టపోయిన రాష్ట్రానికి ప్యాకెజీ తీసుకోవడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు. తాను యాత్ర చేపట్టి ఈ జిల్లాలో ప్రవేశించినప్పటినుండి ఇక్కడి రైతులు, మరియు స్థానికులు తనకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై వివరించారని, చాలా ప్రాంతాల్లో సరైన మంచినీటి సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ లేవని వాపోతాయని, నిజంగా వారి పరిస్థితి చూసి అసలు తనకు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అని అనిపించింది అన్నారు. చంద్రబాబు గారు గత ఎన్నికల సమయంలో ఎన్నో చేస్తామని, హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక ఏమి చేయకుండా, తమ పార్టీ నేతలకు అనునాయులకు మాత్రమే అన్ని చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మీకు ఓటు ఆయుధంతో తప్పకుండ బుద్ధి చెపుతారని అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments