చంద్రబాబు అస్త్రం : త్వరలో లోకేష్ రాష్ట్ర పర్యటన!

Tuesday, July 10th, 2018, 06:07:49 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధర్మపోరాట దీక్షలు చేపట్టిన ఆ పార్టీ, త్వరలో చంద్రబాబు కుమారుడు లోకేష్ తో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమయినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఏపీ తరపున ఐటి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా వున్న లోకేష్ ప్రజల్లోకి వెళ్లి పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా, ఈ గత నాలుగేళ్లలో తమ పార్టీ వారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రానున్న ఎన్నిలకల్లో మళ్ళి విజయం దక్కేలా ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ పర్యటన విషయమై ఇప్పటికే టీడీపీ కావల్సిన ఏర్పాట్లను మొదలెట్టిందట. దాదాపు మూడు నెలలపాటు సాగె ఈ రాష్ట్ర వ్యాప్త యాత్రలో ఆయన మూడు రోజులు ప్రజా సంక్షేమానికి, మరొక మూడు రోజలు అధికారిక కార్యక్రమాలకు కేటాయించనున్నట్లు చెపుతున్నారు.

ఇప్పటికే మంచి రాజకీయ అనుభవం వున్న బాబు టీపీడీ ప్రాభవమ్ ఒకింత తక్కువగా వున్న స్థానాలపై మరింత దృష్టి పెట్టారని, ఆయన లోకేష్ ను ఆయా ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతులను చేసి, టీడీపీ వైపు నడిచే విధంగా ముందుకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు కూడా చేసారట. ప్రస్తతం పార్టీలో తనవంతు కృషితో అన్ని తానై లోకేష్ చూసుకుంటున్నారని, ఇక ఈ యాత్రలో జిల్లాల వారీగా ప్రణాళికలు రూపొందించి పర్యటన చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల అనంతరం ప్రారంభం కానున్న ఈ యాత్రను అన్ని జిల్లాల తెలుగుదేశం నాయకులూ విజయవంతం చేసేలా వారికి దిశా నిర్దేశం చేస్తున్నారట. అంతే కాక ఇటీవల జరిగిన ధర్మ పోరాట దీక్షలు ఇకపై నెలకి ఒకటి లేదా రెండు చేపట్టనున్నట్లు పార్టీ ప్రతినిధులు,కార్యకర్తలు చెపుతున్నారు. అయితే లోకేష్ చేపట్టబోయే ఈ ప్రజా యాత్ర ఏ మేరకు విజయవంతం తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగక తప్పదు మరి….

  •  
  •  
  •  
  •  

Comments