బాబు వేలికి ఉంగరం లేదు.. కానీ రూ.2,381కోట్ల విలువైన కంపెనీ ఉంది…!

Monday, September 19th, 2016, 10:46:34 AM IST

chandrababu
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో తనజేబులోకూడా డబ్బులు పెట్టుకోనని, వెలికి ఉంగరాలు, వాచ్ లు లేవని తన ఆర్థిక పరమైన స్థితిని వివరించేటపుడు చెబుతూంటారు.ఆయన ప్రతి సంవత్సరం మీడియా సమావేశం పెట్టి మరీ తన కుటుంబ సభ్యుల వివరాలని వెల్లడించడం తెలిసిన విషయమే.కాగా క్రితం సారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వారి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించడం విశేషం.కాగా ఆ సందర్భంగా లోకేష్..తాము పాలు అమ్ముకుని బ్రతుకుతున్నామని హెరిటేజ్ కంపెనీని ఉద్దేశించి మాట్లాడడం విశేషం.

కాగా తాజాగా చంద్రబాబు హెరిటేజ్ కంపెనీకి సంబందించిన ఓ విషయం సంచలనం రేపుతోంది.హెరిటేజ్ కంపెనీ విలువ రూ. 2,381 కోట్లుగా తెలుస్తోంది.హెరిటేజ్ స్టోర్స్ చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లలో ఉన్నాయ్.హెరిటేజ్ కంపెనీకి చెందిన 100 స్టోర్స్ ని ఓ జాతీయ కంపెనీ కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో హెరిటేజ్ కంపెనీ విలువ రూ. 2,381 కోట్లుగా తెలుస్తోంది.చంద్రబాబు ఉంగరం కూడా లేదుకానీ వేల కోట్ల విలువ చేసే కంపెనీ ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో సెటైర్ పడుతున్నాయి.అయితే ఇది అధికారికంగా వచ్చిన వార్త కాదు.