చంద్రబాబు కొత్త సర్వే – విజయానికి కారణాలు కూడా చెప్పేసారుగా…?

Thursday, May 16th, 2019, 12:33:20 AM IST

గత కొన్ని రోజులుగా చాలా ఆతృతగా ఎదురు చేస్తున్నటువంటి ఏపీ నాయకులకు మరో కొన్ని రోజుల్లో ఆ ఉత్కంఠకి తెర పడనుంది… రానున్న రోజుల్లో ఏపీలో ఎవరు అధికారాన్ని దక్కించుకుంటారో, ఎవరు ప్రతిపక్షానికి పరిమితం అవుతారో మరో కొద్దీ రోజుల్లో తేలిపోనుంది. కాగా మన నాయకులూ మాత్రం ఎవరి విజయం పై వారు వారి ధీమాతో ఉన్నారు. కాగా వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికే అధికారాన్ని దక్కించుకున్నట్లుగా ప్రవర్తిస్తూ తన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టించుకున్నారు. అంతేకాకుండా నేమ్ ప్లేట్ కూడా జగన్ సిద్ధం చేయించుకున్నారు. కాగా ఏపీలో మరో ముఖ్య నేత అయినటువంటి చంద్రబాబు కూడా తన విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో కంటే ఈసారి మరో 8 సీట్లు ఎక్కువగా సాధిస్తామని చెప్పుకుంటున్నారు. అంటే ఈసారి టీడీపీ ఏపీలో 110 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేస్తుందని చంద్రబాబు అంటున్నారు.

అయితే రానున్న మే 3న ఎవరు గెలుస్తారనే అంశం మీద చంద్రబాబు స్పెషల్ గా ఒక సర్వే కూడా చేయించారని సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు ఇప్పటికే 4 సర్వేలు చేపించారని సమాచారం. కాగా ఈ సర్వేల అన్నింటిలో కూడా టీడీపీ అఖండ విజయాన్ని సాదిస్తుందని తేల్చి చెప్పాయంట. అయితే మొదటి సర్వేలో 150 సీట్లు వస్తాయని తేలగా, కాగా రెండవ సర్వేలో మాత్రం 110 స్థానాలకే టీడీపీ పరిమితం అవుతుందని అంటున్నారు అందరు. కానీఆ తరువాత జరిపిన సర్వేల్లో టీడీపీ 100 నుండి 120సీట్ల మధ్య వస్తాయని, కాగా ఈ విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరని ఈ సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో వృద్ధులు, మహిళలు టీడీపీకి ఓటు వేశారని, కానీ యువత మాత్రం వైసీపీ వైపే మద్దతుగా ఉన్నారని సమాచారం. అంతేకాకుండా ఈసారి కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన జనసేనకు ఆశించినంతగా సీట్లు రావని చెబుతున్నాయి ఈ సర్వేలు…

కానీ చంద్రబాబు చేపించినటువంటి ఈ సర్వేలపై వైసీపీ నేతలు చాలా ఫైర్ అవుతున్నారు. గెలుపుపై అంత ధీమాగా ఉన్నటువంటి చంద్రబాబు ఇంకా 4 సార్లు సర్వేలు ఎందుకు చూపించారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇలా తప్పుడు సర్వేలు చేపించి అందరిని మభ్యపెడుతున్నారని ఆరోపించారు.