పుంజుకుంటున్న జ‌న‌సేన‌.. ప‌వ‌న్‌కి జై కొట్టిన మ‌రో ప్ర‌ముకుడు..!

Sunday, February 10th, 2019, 07:57:47 PM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో అధికార, ప్ర‌తిప‌క్షాలు నువ్వా-నేనా అన్న‌ట్టు పోరాడుతున్నాయి. ఇప్ప‌టికే టిక్కెట్ రాద‌ని తేలిపోయిన అన్ని పార్టీల్లోని అంస‌తృప్త‌లు మెల్లిగా గోడ‌దూకేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో చాలా మంది నేతలు ఎక్కువ‌గా జ‌న‌సేన‌లో చేరేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నారు. ఇప్ప‌టికే మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల్లోని ప‌లువురు కీల‌క నేత‌లు, పారిశ్రామిక వేత్త‌లు, విద్యావేత్త‌లు, రాజ‌కీయ‌విశ్లేష‌కులు జ‌న‌సేన బాట ప‌డుతున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా స‌ర్వీస్ ఉండ‌గానే త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిమ‌రీ జ‌న‌సేన పార్టీలో చేరారు మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్. దీంతో ఇప్ప‌టికే జ‌న‌సేన‌లో వివిధ కీల‌క ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తున్న ప‌వ‌న్, తోట చంద్ర‌శేఖ‌ర్‌ను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. 1987లో సివిల్స్‌కు సెలక్ట్ అయినప్పటి కంటే ఇప్పుడే చాలా ఆనందంగా ఉందని.. చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. ఇక ప‌వ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌శేఖ‌ర్‌తో త‌న‌కు ప‌దేళ్ల సాన్నిహిత్యం ఉంద‌ని, స‌ర్వీసు ఉండ‌గానే ఆయ‌న రాజీనామా చేసి, ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతుగా ఏదో ఒక‌టి చేయాల‌ని ముందుకు రావ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. దీంతో వ‌రుస‌గా ఎన్నిక‌ల టైమ్‌లో ప‌లువురు ముఖ్యులు పార్టీలో చేర‌డం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపుతోంద‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.