అక్కడ ప్రధానిని సెట్ చేసేది నేనే: చంద్రబాబు

Friday, March 30th, 2018, 08:23:33 AM IST

ఆంద్రప్రదేశ్ ముఖ్యంమత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఒక్కోసారి ఆయన చెప్పే మాటలు బాగానే ఉన్నప్పటికీ చివరికి ఆ డైలాగులే ఆయనకు సమస్యలను తెస్తాయి. అయితే ఇప్పుడు మారో సారి ఎవరు ఊహించని విధంగా ఆయన జాతీయ స్థాయి రాజకీయాలను శాసించడం హాట్ టాపిక్ అయ్యింది. 2019 రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాం. తాను సెలెక్ట్ చేసినవారే ప్రధాని అవుతారని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రీసెంట్ గా గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. తెలుగు దేశం పార్టీలోని సీనియర్ నాయకులతో పాటు టీడీపి అభిమానులు కూడా వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం బీజేపీ ఏపి పై కుట్రలు చేస్తుందని, విబజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయినట్లు చెప్పారు. ఇక వచ్చే 2019 ఎలక్షన్స్ లో కేంద్రంలో తాను చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారని చెప్పారు. ఇక బీజేపీ హింసా రాజకీయాలు చేస్తోందని తాము ఎప్పుడు అలా చేయలేదని వ్యాఖ్యానించారు.