బీజేపీయేతర ప్రభుత్వమే లక్ష్యం – చంద్రబాబు

Saturday, May 18th, 2019, 03:00:08 AM IST

ఎన్నికల ఫలితాలు రావడానికి సమయం దగ్గర పడుతుండటంతో నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్రం లో ఏర్పాటు చేసే ప్రభుత్వమే లక్ష్యంగా స్థానిక పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ”బీజేపీ, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకొనిపోతాం. వారందర్నీ కలుపుకొని ఒక దగ్గరికి తీసుకురావడమే లక్ష్యంఫంగా పని చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అందుకోసమనే శుక్రవారం ఆయన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కొన్ని కీలకమైన చర్చలు జరిపారు.

అంతేకాకుండా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌తో కూడా కలిసి చర్చించనున్నారు. ఆ తరువాత లఖ్‌నవూ చేరుకొని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతిలో చర్చిస్తారు. కాగా మరో వారం రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలలో టీడీపీ విజయం సాదిస్తుందని, అంతేకాకుండా కేంద్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ కీలకం కానుందని, చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు అనుభవం బీజేపీయేతర ఫ్రంట్‌ నిర్మాణానికి కలిసొస్తుందని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌, తెలుగుదేశం సహా 17 రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై సమావేశమై వారి మధ్య రాజకీయ ఐక్యత సాధ్యపడే అవకాశాలున్నాయని ఈ వర్గాలు అంటున్నాయి.