కొత్త ఐటీఆర్ లో మార్పులు…సాలరీడ్ పర్సన్స్ ఏమిచేయాలంటే?

Tuesday, April 17th, 2018, 01:35:02 AM IST

ఇదివరకు సాలరీడ్ పర్సన్స్ జీతభత్యాల గురించి వివరాలు ఐటీఆర్‌–1 లో తెలియచేయవలసిన అవసరం వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ సంస్థ వీటిలో సరికొత్త మార్పులు తీసుకురావడంతో ఇప్పుడు తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగస్తులకు యాజమాన్యం వారిచ్చే స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ విషయంలో మార్పుల వలన, లిస్ట్‌ కాని కంపెనీ షేర్లుంటే వాటి ‘ప్రైమరీ మార్కెట్‌’ విలువను సీఏ, మర్చంట్‌ బ్యాంకర్‌తో ధ్రువీకరించాలి. అద్దెకిచ్చిన ఇల్లు ఉంటే దాని మీద అద్దె వివరాలివ్వాలి. మూలధన లాభాలకు సంబంధించి అదనపు వివరాలివ్వాలి.

మినహాయింపులు పొందిన వారు వాటిని సవివరంగా తెలియజేయాల్సి ఉంటుంది. కొన్ని ఫారాలలో అసెస్సీకి సంబంధించిన కాలమ్‌ ‘జెండర్‌’ తొలగించారు. పార్టనర్ షిప్ సంస్థలు భాగస్వాముల ఆధార్‌ వివరాలను తెలియజేయాలి. పార్టనర్ గత సంవత్సరం వరకూ ఫారం–2ను దాఖలు చేయవచ్చు. ఈ సారి ఫారం–3లో రిటర్నులు దాఖలు చేయాలి. అలాగే నాన్‌ రెసిడెంట్లు ఫారం–1కి బదులుగా ఫారం–2 దాఖలు చేయాలి. ఇందులో అదనంగా సమాచారం ఇవ్వాలి. వారు రిఫండ్‌ క్లెయిమ్‌ చేసినప్పుడు విదేశీ బ్యాంక్‌ వివరాలిస్తే, ఆబ్యాంక్‌ ఖాతాకు రిఫండ్‌ ఇస్తారు. కొంతమంది నిర్దేశించిన శాతాన్ని లాభంగా చూపించడం ప్రిజంప్టివ్‌ ట్యాక్సేషన్‌ అంటారు. వారు ఈసారి అదనంగా సమాచారం ఇవ్వరు.

అలానే వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు జీఎస్‌టీ రిటర్నులలో పేర్కొన్న టర్నోవర్‌ను చూపించాలి. దీనివలన పుస్తకాల టర్నోవర్‌తో, జీఎస్‌టీ టర్నోవర్‌ను పోల్చి చూస్తారు. వ్యత్యాసం ఉంటే వివరణ ఇవ్వాలి. అలాగే కంపెనీల విషయంలో ఎన్నెన్నో వివరాలు, అంటే అన్ని విషయాలు సంక్షిప్తంగా ఫారం లో తెలియచేయాలి. అయితే సాలరీడ్ ఎంప్లాయిస్ విషయంలో గడువుతేది జులై 31, 2018గా నిర్ణయించారు. దీనిని ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. అన్ని కాగితాలు సమకూర్చుకుని, సరిచూసుకొని, ఖచ్చితంగా ఫైల్‌ చేయండి. ఒకవేళ డ్యూ డేట్ దాటితే రూ.5,000, అదే ఈ సంవత్సరం డిసెంబర్ దాటితే రూ.10,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది…..