రెండురోజుల్లో పునః ప్రసారాలు..!

Thursday, September 11th, 2014, 01:07:51 PM IST


హైదరాబాద్ వచ్చిన కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ను మీడియా ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో కేబుల్ ఆపరేటర్లు నిలిపివేసిన చానళ్ళ ప్రసారాలను తిరిగి పునరుద్దరించేవిధంగా చర్యలు తీసుకోవాలని వారు జవదేకర్ కు విజ్ఞప్తి చేశారు.అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మూడు నెలలుగా చానళ్ళ ప్రసారాల నిలిపివేతపై జవదేకర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. భాధ్యతాయుతంగా వ్యవహరించే మీడియా తమ అండ ఎప్పుడు ఉంటుందని జవదేకర్ తెలిపారు. చానళ్ళ ప్రసారాలను పునరుద్దదించేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. మీడియా స్వేచ్చను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. రెండు రోజుల్లో చానళ్ళ ప్రసారాలను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.