ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూత

Sunday, January 4th, 2015, 12:34:00 PM IST

Ahuti_Prasad
ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా పురీషనాళ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు విజయవంతమైన సినిమాలలో నటించారు. ముఖ్యంగా ఆహుతి సినిమాతో ఆయన మంచి పేరు తెచ్చుకొని, ఆహుతి ప్రసాద్ గా మారిపోయారు. ఇక కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డ్ లభించింది. ఆహుతి ప్రసాద్ సినిపరిశ్రమలో సౌమ్యుడిగా, అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణం సినిపరిశ్రమకు తీరని లోటని సినిప్రముఖులు అంటున్నారు. ఆహుతి ప్రసాద్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా, మరొకరు ఫైలట్.