తన తండ్రితో బాహుబలి రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్న చరణ్

Tuesday, January 31st, 2017, 12:30:00 PM IST

ramcharan-chiranjeevi
మెగా స్టార్ చిరంజీవి ఖైదీ సూపర్ సక్సెస్ లో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఖైదీ సినిమా ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావడం ఎవ్వరూ ఊహించలేదు. చిరు కి మంచి కం బ్యాక్ అవుతుంది అనుకున్నారు కానీ ఈ రేంజ్ లో దూసుకెళ్తుంది అని ఊహలో కూడా ఎవ్వరికీ లేదు. సో పూర్తిగా151 మీద మనసు పెట్టాడు చరణ్. ఈ సినిమాకి కూడా చరణ్ ప్రొడ్యూసర్ గా నిలవాలి అనుకుంటున్నాడు. సురేందర్ రెడ్డి తో చారిత్రాత్మక చిత్రం గా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కి ఓటు వేసాడు చిరు. ఈ సినిమా బాహుబలి రేంజ్ అవుట్ పుట్ కోసం చరణ్ కష్టపడుతున్నాడు అనీ దాని కోసమే రాజమౌళి దగ్గర విజవల్ ఎఫ్ఫెక్ట్స్ కోసం పని చేసిన కమల్ కన్నన్ తో చెర్రీ చర్చ జరిపినట్టు తెలుస్తోంది. చెర్రీ బిగ్గెస్ట్ హిట్ అయిన మగధీర కోసం కూడా ఈయనే విజువల్ ఎఫెక్ట్స్ అందించాడు. అయితే.. పీరియాడికల్ మూవీ కావడంతో.. ఉయ్యాలవాడకు గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా సెట్స్ తో అవసరం ఉంటుంది. కొన్ని అంశాలకు మాత్రం గ్రాఫిక్స్ వాడకం తప్పనిసరి.