చెలరేగిన చార్లెస్ – భారత్ ఓటమి

Monday, July 1st, 2013, 08:48:02 AM IST


ఇటీవలే చాంపియన్స్ ట్రోపీ విజేతగా నిలిచి ఫుల్ ఫాంలో ఉన్న ఇండియన్ టీంకి విండీస్ ఓ షాక్ ఇచ్చింది. వెస్ట్ ఇండీస్ ఆతిధ్యంలో కరేబియన్ దీవుల్లో ఓ ముక్కోణపు సీరీర్ మొదలైంది. ఈ సీరీస్ తొలి మ్యాచ్ లో భాగంగా భారత్ – వెస్ట్ ఇండీస్ తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్ట్ ఇండీస్ భారత్ బాట్స్ మెన్స్ ని మొదటి నుంచి తమ బౌలింగ్ తో కట్టడి చేసింది. దాంతో తూతూ మంత్రంగా సాగిన భారత్ బ్యాటింగ్ ముగిసేసరికి 7 వికెట్లు నష్టపోయి 229 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన వెస్ట్ ఇండీస్ ఓపెనర్స్ ని భారత్ తమ బౌలింగ్ తో కాస్త కట్టడి చేసినప్పటికీ ఓపెనర్ అయిన చార్లెస్ 97 పరుగులు చేసి విండీస్ ని విజయపతాన నడిపిస్తుంటే అతనికి భాగ స్వామ్యంగా బ్రావో నిలబడి 55 పరుగులను జోడించడం తో విండీస్ విజయం ఖరారైంది. 47.4 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసి సొంత గడ్డపై విజయాన్ని నమోదు చేసుకుంది. చాంపియన్స్ ట్రోపీ గెలుచుకొని ఇంకా అదే ద్యాసలో ఉన్న టీం ఇండియాకి విండీస్ గెలుపు ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.