జనసేన నాయకులమంటూ కోటి రూపాయలు మోసం…

Saturday, March 10th, 2018, 11:59:30 AM IST

అభిమానం పేరుతో అన్యాయంగా మోసాలు చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ నాయకులమని, పార్టీ అధినేత పవన్ కళ్యాన్ దగ్గర ఉంటామని, ఆయనకీ వీర అభిమానులమని ఎల్లవేళలా పార్టీ కోసమే కృషి చేస్తామని చెప్పి ఒక యువతి దగ్గర దాదాపు మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు తీసుకొని మోసం చేసి పారిపోయారు. ఈ మోసానికి పాల్పడిన వారిలో మొత్తం 7 గురు ఉన్నారని వాళ్ళని వెతికి పట్టుకున్నామని పోలీసులు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లలో ఏలూరు ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు టౌనుకు చెందిన ఓ బంగారు వ్యాపారి కుమార్తెతో కొందరు అబద్దపు అభిమాన దుండగులు సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్కొని, తాము జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటామని, మేము పార్టీ నాయకులమే కాకుండా ఆయనాకి అభిమానులమని పవన్ కళ్యాణ్ ని నీకు పరిచయం చేస్తామని మాయ మాటలు చెప్పారు.

కొద్దికాలం అలా పరిచయం స్నేహం వరకు తీస్కెళ్ళి వారికి కొంచం డబ్బులు అవసరం ఉన్నాయని ఆ అమ్మాయి బంగారు నగలు ఇస్తే తరువాత వాటిని మళ్ళీ తిరిగి ఇస్తామని కొన్ని నగలు తీస్కున్నారు. తర్వాత ఆమెను బెదిరించి మళ్ళీ కొన్ని నగలు తీస్కున్నారు. ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టి జల్సాలు చేస్కునేవారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న అమ్మాయి పోలీసుల గడప తొక్కాల్సి వచ్చింది. వివరాలు తెల్సుకొని కేసు నమోదు చేసిన పోలీసులు ఏలూరుకు చెందినా దత్తి బాలాజీ, సింహాద్రి, బాలచందర్, పిల్లా సాయిదేవేంద్ర నాయుడు, విప్పర్తి ప్రాన్సిస్, కొండి రాజేష్, గుజ్జుల రాజీవ్, తుమ్మపల్లి అశోక్ కుమార్ లను శుక్రవారం అరెస్ట్ చేసారు. వారి దగ్గర నుంచి 3,424 గ్రాముల బంగాఋ ఆభరణాలు, ఒక కారు, రెండు బైకకులు, సెల్ ఫోన్లు స్వాదీనం చేస్కున్నారు. వీటి విలువ సుమారు రూ. 1. 23 కోట్ల వరకు ఉంటుదని పోలీసులు వెల్లడించారు. రాజకీయ నాయకులే మాటలిచ్చి మోసం చేస్తారు అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ అభిమానం పేరు చెప్పి కుడా మోసాలకు పాల్పడుతున్నారని ఇప్పుడే తెలిసింది కదూ.