చెక్ బౌన్స్ అయితే వడ్డీ కట్టక తప్పదు!

Tuesday, July 31st, 2018, 12:20:00 PM IST

డిజిటల్ లావాదేవీలు చాలావరకు గ్రామాల్లో కూడా పెరుగుతున్నాయి. ఇక అంతే స్థాయిలో కొన్ని ఆర్థిక లావాదేవీల్లో చెక్ లకు ప్రాధాన్యత తగ్గడం లేదు. ఆర్థిక లావాదేవీల్లో హామీగా చెక్కులు ఇవ్వడం సాధారణమే. ఈ పోస్ట్‌డేటెడ్‌ చెక్కుల లావాదేవీల్లో ఎక్కువగా తేడాలు వస్తున్నాయి. అందుకే చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో 45 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయని అలాగే ఒక కేసులో న్యాయం వచ్చేసరికి నాలుగేళ్ల సమయం పడుతోందనిక్ ఒక సర్వేలో తేలింది.

కేసు తేలేవరకు బాదితులకు నష్టమే గాని ఎలాంటి లాభం లేదు. అందుకే నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ యాక్ట్‌ 1881కి కీలక సవరణలు చేశారు. పార్లమెంట్ లో ఆమోదం రావడంతో త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఇందువల్ల చెక్ బౌన్స్ పెండింగ్ కేసుల విచారణ తొందరగా ఓ కొలిక్కి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఏ మాత్రం చెక్ బౌన్స్ అయినా కూడా ముందుగా చెక్ ఇచ్చిన దానిలో 20 శాతం కట్టితీరాలి. అందుకు 60 రోజుల గడువు ఉంటుంది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ బాధితుడికి కొంతైనా దక్కుతుండడం ఊరటనిచ్చే అంశం. ఇక చెక్ ఇచ్చిన వ్యక్తి కింది కోర్టుని కాదని హై కోర్టుకు వెళ్లినా కూడా 20 శాతం చెల్లించాల్సిందే. ఇక కేసులో సరైన అధరాలు చూపించకపోతే డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీతో సహా చెల్లించక తప్పదు. నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ యాక్ట్‌లో సెక్షన్‌ 143ఏ ప్రకారం ఈ సవరణలు వచ్చి చేరాయి.

  •  
  •  
  •  
  •  

Comments