రివ్యూ రాజా తీన్‌మార్ : చెలియా – స్వీట్ టార్చర్ !

Friday, April 7th, 2017, 03:18:21 PM IST


తెరపై కనిపించిన వారు: కార్తి, అదితిరావు హైదరి

కెప్టెన్ ఆఫ్ ‘చెలియా’ : మణిరత్నం

మూల కథ :
1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో డాక్టర్ లీల (అదితిరావు హైదరి) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ పైలెట్ వరుణ్ (కార్తి) తో ప్రేమలో పడుతుంది. అలా వారిద్దరూ ప్రేమలో ఉండగానే సరైన కమిట్మెంట్ లేని వరుణ్ ప్రవర్తన, మనస్తత్వం వలన లీల అతనికి దూరమవుతుంటుంది.

అలాంటి సమయంలోనే వచ్చిన ఒక యుద్ధ వాతావరణంతో వరుణ్ పాకిస్తా జైల్లో బందీ అవుతాడు. అలా పాకిస్థాన్ చేతిలో బందీ అయిన కార్తి ఎలా తప్పించుకున్నాడు ? చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే తెరపై నడిచే కథ..

విజిల్ పోడు :

–> సినిమాకు ప్రధాన ఆకర్షణ రవి వర్మ అందించిన కెమెరా వర్క్. కాశ్మీర్, లడక్ వంటి లొకేషన్లలో తీసిన ప్రతి షాట్ చాలా అందంగా అనిపించింది. హీరో హీరోయిన్ల మధ్య నడిచే రొమాన్స్ ను ప్రతి ఫ్రేమ్లో అందంగా బందించి మనముందుంచాడు రవి వర్మ. కనుక మొదటి విజిల్ ఆయనకే వేయాలి.

–> ఇక దర్శకుడు మణిరత్నం సినిమా మొదటి భాగం మొత్తాన్ని హీరో హీరోయిన్ల మధ్య నడిచే ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాతో, ఇతర ఆసక్తికర అంశాలతో నింపేసి తన మార్క్ చూపించాడు. అలాగే క్లైమాక్స్ కు కూడా చాలా భావోద్వేగంగా రూపొందించారు. కనుక రెండవ విజిల్ ఆయనకు వేయాలి.

–> హీరో కార్తి ఫైటర్ పైలట్ పాత్రలో చాలా గొప్పగా నటించాడు. డ్రెస్సింగ్ దగ్గర్నుంచి నటన వరకు ప్రతి అంశంలోనూ పెర్ఫెక్షన్ చూపించాడు. అలాగే హీరోయిన్ అదితిరావ్ హైదరి కూడా ఇదివరకు లేనంత అందంగా కనిపిస్తూనే మంచి నటనను కూడా ప్రదర్శించింది. కనుక మూడవ విజిల్ వీరిద్దరికీ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ఆరంభం, ఫస్టాఫ్ అంతా పార్లెఉడ్ బాగుండనై అనుకునే లోపు సెకండాఫ్లో మణిరత్నం అసలు డ్రామాని మొదలుపెట్టాడు. స్లోగా సాగే ఆ డ్రామా చూస్తుంటే నిద్రొస్తున్నట్టే ఉంటుంది. ఆ స్లోనెస్ చూడలేక తల తిప్పుకుంటే అయినా మణిరత్నం కదా ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అని తలెత్తాలనిపిస్తుంది. తీరా చూస్తే అదే నత్త నడక డ్రామా. దీంతో ఏంటీ పరీక్ష అనిపించింది.

–> ఇక అదే సెకండాఫ్లో హీరో క్యారెక్టరైజేషన్ సరిగా చూపకపోవడం, లవ్ డ్రామా కూడా పట్టు తప్పి అటు ఇటు వెళ్లిపోవడం నిరుత్సాహపరిచింది.

–> అలాగే హీరో ప్రేమ నుండి పక్కకు వెళ్లిపోవాలనుకోవడం వంటివి బాగున్నా అసలు హీరో ఎందుకు అలా చేయాలనుకుంటాడు అనేది చెప్పకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> దర్శకుడు మణిరత్నం కనుక కథ, కథనాల్లో గాని, పాత్రల ప్రవర్తనలో గాని ఆశ్చర్యపడాల్సిన వింతలేవీ లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఆ రొమాంటిక్ డ్రామాని మణిరత్నం తప్ప ఎవరు నడపలేరు కదా !
మిస్టర్ బి : అవునవును.. కానీ సెకండాఫ్లోనే నడపకుండా పాకేలా చేసాడు.
మిస్టర్ ఏ : నిజమే అక్కడ కాస్త దెబ్బతింది. అయినా కూడా ఇదొక స్వీట్ డ్రామా.
మిస్టర్ బి : స్వీట్ డ్రామా కాదు.. స్వీట్ టార్చర్ అంటే బాగుంటుందేమో.