ఈ ఆహారం తింటే మీ హార్మోన్లు మారి అలా అయిపోతారు

Monday, April 30th, 2018, 01:18:40 PM IST

విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుతూ ఉత్పత్తి చేస్తున్న ఆహారం మానవుల్లో హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతున్నదని కెనడా శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఐఎన్‌ఆర్‌ఎస్) పరిశోధకులు తెలిపారు. వారు నియోనికోటినాయిడ్స్ పురుగులపై పరిశోధనలు జరిపారు. పంటలను నాశనం చేసే కీటకాలను నియంత్రించేందుకు గతంలో శాస్త్రవేత్తలు నియోనికోటినాయిడ్స్ అనే పురుగులను ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. వీటిని పురుగుమందుల మాదిరిగా పంట పొలాల్లో చల్లుతారు. ఇవి స్వతహాగా విషపూరితమైనవి. పంటలను ఆశించే పురుగులు ఆకులను తిన్నప్పుడు నియోనికోటినాయిడ్స్ విడుదల చేసిన విషం వాటి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, అంతిమంగా మరణానికి దారి తీస్తుంది.

ఈ విష ప్రభావం మానవులపై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఐఎన్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహించి, హర్మోన్ వ్యవస్థలో మార్పులు కలుగజేస్తున్నదని తేల్చారు. ముందుగా శాస్త్రవేత్తల బృందం నియోనికోటినాయిడ్స్ విషం మానవుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరీక్షించగా, హార్మోన్ పనితీరులో చాలా మార్పులు వచ్చాయని గమనించారు. ఛాతి కాన్సర్ సోకిన కణాల్లోనూ ఇలాంటి మార్పులే జరుగుతున్నట్టు తేల్చారు. నియోనికోటినాయిడ్స్ వల్ల మానవులకు ఛాతి కాన్సర్ సోకే ప్రమాదం ఉన్నదని ఇప్పుడే నిర్ధారించలేమని, హర్మోన్ల విడుదల, పనితీరుపై ప్రభావం చూపుతుందని కచ్చితంగా చెప్పగలుగుతామని పరిశోధక బృంద సభ్యులు ఎలైస్ కారోన్ తెలిపారు. వీరి పరిశోధన వ్యాసం ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ ప్రెస్పిరేటివ్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

  •  
  •  
  •  
  •  

Comments