‘చెన్నై ఎక్స్ ప్రెస్’ కి పాకిస్థాన్లోను భారీ కలెక్షన్లు

Thursday, August 15th, 2013, 04:46:24 PM IST


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా భారతచేశంలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతదేశంతో పాటుగా రంజాన్ ఈద్ సందర్బంగా పాకిస్థాన్ లో కూడా విడుదల చేశారు. ఈ సినిమా పాకిస్థాన్ బాక్స్ వద్ద కూడా మంచి కలెక్షన్ లు నమోదు చేస్తోంది. ఈ సినిమా పాకిస్థాన్ ప్రేక్షకులకు బాగా నచ్చిందని అదే రోజున విడుదలైన మరికొన్ని సినిమాలను వెనక్కి నెట్టి ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోందని కాప్రి సినిమా జనరల్ మేనేజర్ అజీజ్ ఖాన్ తెలియజేశాడు.