ధోని మొదటి అడుగు పడింది!

Friday, March 23rd, 2018, 10:02:49 AM IST

ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్లు నిషేదానికి గురైనా సంగతి తెలిసిందే. ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ధోని చెన్నై టీమ్ నిషేధం తరువాత వేరే జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సారి జరగబోయే ఐపీఎల్ 11వ సీజన్ కోసం చెన్నై జట్టు స్పెషల్ గా రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇన్ని రోజులు గ్రౌండ్ లో కనిపించకుండా పోయినా యల్లో జెర్సీలు ఇక నిండుగా కనిపించనున్నాయి. ఆ జట్టు సభ్యులు మొదటి సారి మద్రాస్ లో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు.

ఇక విదేశీ ఆటగాళ్లు కూడా మరికొన్ని రోజుల్లో ప్రాక్టీస్ చేయడానికి సిద్ధం కానున్నారు. కొందరు వారి దేశాల టోర్నీలు అయిపోగానే ఐపీఎల్ మధ్యలో రానున్నారు. మొత్తంగా ధోని సారథ్యంలో చెన్నై జట్టు పూర్తిగా సిద్దమయ్యింది. జట్టు యజమాని శ్రీనివాసన్ కూడా కూడా ప్రాక్టీస్ లో ఆటగాళ్లతో సంభాషించారు. ముఖ్యంగా ధోనితో ఆయన చాలా సేపు చర్చలు జరిపారు. ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కతా తో తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా రెండేళ్ల తరువాత తీరిగి ఐపీఎల్ లోకి అడుగుపెట్టనుంది.