చెన్నై కు కేకేఆర్ దెబ్బ.. గిల్ – దినేష్..జిగేల్

Friday, May 4th, 2018, 01:02:33 AM IST

ఐపీఎల్ లో అసలైన పోటీ ఇప్పుడే మొదలైంది. ఐపీఎల్ లోని జట్లు మొన్నటి వరకు ఆడినది ఒక లెక్క ఇప్పుడు ఆడేది మరో లెక్క. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లు చాలానే ఉన్నాయి. ఇక గురువారం జరిగిన కోల్ కత్తా – చెన్నై మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 లో స్థానాన్ని బలపర్చుకోవాలంటే గెలవక తప్పని మ్యాచ్ దినేష్ సేన గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 3లో నిలిచింది. చెన్నై బ్యాట్స్ మేన్స్ బాగానే రాణించినా బౌలర్లు చేతులెత్తేయడంతో ఓటమిని చూడలేక తప్పలేదు.

టాస్ గఒడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణిత ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఓపెనర్లు షేన్ వాట్సాన్ (36) డూ ప్లెసిస్ (27) మంచి ఆరంభాన్ని అందించగా కెప్టెన్ ధోని అవసరమైన సమయంలో 25బంతుల్లో ఒక ఫోరు నాలుగు సిక్సులతో 43 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరును అందించాడు. కోల్ కత్తా బౌలర్లలో సునీల్ నరైన్ – పీయూష్ చావ్లా రెండు వికెట్లు అందుకోగా కూల్ దీప్ ఓకే వికెట్ పడగొట్టాడు. 5 వికెట్ల నష్టానికి చెన్నై 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ మొదట తడబడినా ఆ తరువాత పుంజుకొని 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. యువ ఆటగాడు శుభమన్‌ గిల్‌ 57 (36) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దినేష్ కార్తీక్ 18 బంతుల్లో 45 పరుగులు చేసి కెప్టెన్ గా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ దెబ్బతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలవగా గెలుపుతో నాలుగవ స్థానం నుంచి కోల్ కత్తా ,మూడవ స్థానానికి చేరుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments