చెన్నై మూడు సార్లు కొట్టింది.. నాలుగో పంచ్ హైదరాబాద్ దే!

Saturday, May 26th, 2018, 02:00:03 PM IST

మొత్తానికి ఐపీఎల్ చివరి దశకు చేరింది. రెండు నెలల పాటు కష్టపడి పోరాడిన జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏ మాత్రం తడబకడకుండా ఫైనల్ కి చేరుకుంది. కానీ హైదరాబాద్ మాత్రం మొదట బాగానే ఆడినా కూడా ప్లే ఆఫ్ దశలో కాస్త తడబడింది. చెన్నై ఇచ్చిన స్ట్రోక్ కి ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా పై పగ తీర్చుకొని ఫైనల్ కు చేరుకుంది. ఈ సీజన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీమ్ కు చెన్నై గట్టి పోటీని ఇచ్చింది.

లీగ్ మ్యాచ్ లో పెద్దగా వర్కౌట్ కాలేదు. వరుసగా రెండు మ్యాచ్ లలో విలియంసన్ ప్లాన్ ఫెయిల్ అయ్యాయి. ఇక మూడవసారి అయినా ధోనిని ప్లే ఆఫ్ లో దెబ్బ కొట్టాలని అనుకున్న సన్ రైజర్స్ కు డూ ప్లేజిస్ ద్వారా ఓటమి తప్పలేదు. ఇక ఫైనల్ గా నాలుగసారైనా ధోని సేనను ఓడించాలని విలియంసన్ రెడీ అవుతున్నాడు. ధోని కూడా మరో వైపు తన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాడు. గత మ్యాచ్ లో ఇచ్చిన ఛాన్స్ కూడా మళ్లీ ఈ సారి ఇచ్చేలా లేడు. ప్లే హాఫ్ లో కొంచెం తడబడ్డం అని ధోని ఒప్పుకున్నాడు. మళ్లీ అది రిపీట్ అవ్వదని చెన్నై ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చేయడంతో హైదరాబాద్ టీమ్ కు మళ్లీ ఓటమి తప్పదని కామెంట్స్ వస్తున్నాయి. ఇక హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం చెన్నై మూడు దెబ్బలకు ఈ సారి హైదరాబాద్ పంచ్ గట్టిగా ఇస్తుందని చెబుతున్నారు. రేపు ముంబై వాంఖేడే స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.