50 వేల బిల్లుకి లక్ష 30 వేల టిప్పు ఇచ్చాడా..? దే…..వుడ

Tuesday, April 17th, 2018, 04:15:42 PM IST

హోటల్‌కు వెళ్తే.. అక్కడ మీకు వంట నచ్చితే.. మీరెంత టిప్ ఇస్తారు. మా అంటే వెయిటర్‌ను సంతృప్తి పరుస్తారు. కానీ అమెరికాలో ఓ భోజన ప్రియుడు ఆ హోటల్ సిబ్బందికే తన టిప్‌తో షాక్ ఇచ్చాడు. ఆ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న అందర్నీ స్టన్ చేశాడు. సియాటిల్‌కు చెందిన మైక్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో చికాగోలో ఉన్న బోకా రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ తిన్న తిండికి 759 డాలర్ల (సుమారు రూ.50వేలు) బిల్లు అయ్యింది. అయితే ఆ రెస్టారెంట్ కుక్స్ వండిన డిష్‌లు మైక్‌కు తెగ నచ్చాయి. ఆ సంతోషాన్ని తన టిప్‌తో చాటిచెప్పాడు. హోటల్ సిబ్బందికి సుమారు రెండువేల డాల‌ర్లు(రూ.లక్షా 30వేలు) టిప్‌గా ఇచ్చాడు. బిల్ తెచ్చిన వెయిటర్‌కు మొదటగా సుమారు 300 డాలర్లు టిప్ ఇచ్చాడు. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి 17 మంది స్టాఫ్ సభ్యులకు ఒక్కొక్కరికి 100 డాలర్లు ఇచ్చాడు. సిబ్బందితో మైక్ దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఆ హోటల్.