చిరంజీవి అర్జున్ సరే, లక్ష్మి సౌభాగ్యవతి ఎవరు..?

Sunday, March 10th, 2019, 05:31:18 PM IST

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో సుశాంత్, రుహాణి శర్మ హీరో హరోయిన్లుగా నాగార్జున అక్కినేని, జస్వంత్ నాడిపల్లి సంయుక్తంగా నిర్మించిన సినిమా “చిలసౌ”, ఈ శనివారం సాయంత్రం 6గంటలకు జెమినీ టీవిలో ప్రసారం కానుంది. వరుస ఫ్లాప్స్ తో ఢీలా పడి చాలా గ్యాప్ తీసుకున్న సుశాంత్ కు ఈ సినిమా కాస్త ఉరటనిచ్చిందనే చెప్పాలి. ఫీల్ గుడ్ స్టోరీతో డీసెంట్ స్క్రీన్ ప్లేతో రాహుల్ ఈ సినిమాను చక్కగా డీల్ చేసాడు. డీసెంట్ టాక్ తో ఈ సినిమా ఇటు యూత్ ని, అటు ఫామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. మరి స్మాల్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.