చిన్నారి ప్రాణం తీసిన హై హీల్స్!

Wednesday, May 9th, 2018, 02:38:00 AM IST

బిడ్డపట్ల ఓ కన్నతల్లి చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఏకంగా ఆ బిడ్డ ప్రాణాన్నే బలిగొన్నది. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో భర్త, తన ఆరునెలలబిడ్డతో సహా నివాసముండే షేక్ ఫెహ్మీదకు అందరూ తల్లుల్లానే తన బిడ్డ అంటే ప్రాణం. అయితే ఒకరోజు కళ్యాణ్ ప్రాంతంలో జరుగుతున్న వివాహవేడుకకు భర్త, బిడ్డతో బయలుదేరి వెళ్ళింది. కాగా ఆమె ఆ రోజు హై హీల్స్ చెప్పులు ధరించి వుంది. వేడుక ఆనందంగా జరగడంతో తిరుగుపయనమైన ఫెహ్మిదా, వేడుక జరిగే ఫంక్షన్ హాల్ లో మొదటి అంతస్థు మెట్లు దిగుతుండగా ఆమె వేసుకున్న చెప్పులు ఒక్కసారిగా స్లిప్ అయ్యాయి.

అంతే ఆమె చేతిలోని బిడ్డ జారీ మెట్ల మీదుగా క్రింద వరకు దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న బిడ్డను ఫెహ్మిదా, ఆమె భర్త ఇద్దరూ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బిడ్డ అప్పటికే మరణించిందని తేల్చారు. తాను చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఆ తల్లి పడే ఆవేదన అక్కడివారందరి హృదయాలను కలిచివేశింది. అయితే బిడ్డ ప్రమాదం విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు…….

Comments