బిచ్చగాళ్ల నెల సంపాదన తెలిస్తే.. మీ జాబ్ చాలా చీప్

Tuesday, November 7th, 2017, 10:53:14 AM IST

ప్రస్తుత రోజుల్లో సాధారణ వ్యక్తి ఎంత కష్టపడినా రోజుకు 300 వందలు సంపాదించడం అంటే చాలా గొప్పే అని చెప్పాలి. నెల జీతం కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఒక్కరోజుల్లో ఎన్ని వేల జీతం వచ్చినా రెండు రోజుల్లోనే మాయమైపోవడం ఖాయం. కానీ బిచ్చగాళ్లు నెల ఆదాయం ఎంతో తెలిస్తే ఆ పని చేసుకున్నా బెస్ట్ రా బాబు అనకుండా ఉండలేరు. మన దేశ మెట్రో నగరాల్లో ఒక బిచ్చగాడు రోజుకు కనీసం 500 వందలు సంపాదిస్తున్నాడట. ఇక నెల రోజుల్లో 20 వేలకు పైగానే వారి టార్గెట్ దాటుతోందని ఓ సర్వేలో వెల్లడైంది.

ఇక చైనాలో అయితే యాచకుల సంపాదన తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం. ఒక బిచ్చగాడు రోజుకు 3334 సంపాదిస్తున్నాడట. అంటే నెలకు లక్ష రూపాయలని తెలుస్తోంది. మరొక షాకింగ్ నిజమేంటి అంటే.. తన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో సంపాదిస్తున్నాడు. అంతే కాకుండా రెండు అంతస్థుల బంగ్లాలను కూడా కట్టేశాడు. ఇంత ఆస్థి ఉన్న కూడా ఆ బిచ్చగాడు అడుక్కోవడం మానడం లేదు. అతను డబ్బులు లెక్కపెడుతోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. చూసిన వారు వీడే చాలా గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Comments