ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది.. రూ.65 వేల కోట్ల లాభం!

Tuesday, March 6th, 2018, 10:43:57 PM IST

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడపుడు కొంత మంది ప్రముఖుల జీవితాలు ఇతరులకు ఆదర్శంగా నిలవడానికి కారణం ఒకే ఒక్క ఆలోచన అంటే నమ్మకుండా ఉండగలరా?. రీసెంట్ గా అందుకు ఉదాహరణగా ఒక ప్రముఖుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతను క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఈ రోజు వేల కోటీశ్వరున్ని చేసింది. ఆ ఐడియా రూ.65 వేల కోట్ల లాభాన్ని అందించింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. చైనాకు చెందిన జూహ్యంగీ అనే వ్యక్తి ఓహియో 360 టెక్నాలజీ కో అనే అన్‌లైన్‌ సెక్యూరిటీ సంస్థను అమెరికాలో స్థాపించాడు.

అయితే సైబర్ సెక్యూరిటీని తన టెక్నాలిజీతో అంతటా పాపులర్ అయ్యేలా చేయాలనీ అనుకున్నాడు. ముందుగా తన సొంత దేశానికి సంస్థను షిఫ్ట్ చేశాడు. అప్పుడు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో ఓహియో 360 టెక్ 2 బిలియన్‌ డాలర్ల విలువ కలిగి ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ లో రూ.13 వేల కోట్లు. ఆ విలువ జూహ్యంగీకి మంచి లాభమే. అయినా కూడా చైనాకు తరలించాడు. అక్కడ ఓ షెల్‌ కంపెనీతో విలీనం చేశాడు. దీంతో అతి తక్కువ కాలంలోనే అతని జీవితం టర్న్ అయ్యింది. షాంగై స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో గత బుధవారం 360 సెక్యూరిటీ టెక్నాలజీ పేరుతో లిస్ట్‌ చేయగా.. ఆ లిస్టింగ్‌ సమయంలో కంపెనీ బ్రాండ్ పెరిగింది. దీంతో 13.6 బిలియన్‌ డాలర్లు షేర్స్ పెరిగింది. అంటే దాదాపు రూ.78వేల కోట్లు. ఈ లాభంతో జూహ్యంగీ చైనాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 12వ ర్యాంక్ కు చేరాడు.