కుటుంబ నియంత్రణ విధానంపై చైనా వాసుల్లో కలవరం!

Tuesday, July 10th, 2018, 11:56:37 PM IST


1979 నుండి చైనాలో జనాభా తగ్గించే మేరకు అక్కడి ప్రభుత్వం జనాభా తగ్గుదలకు ఇకనుండి ఇంటికి ఒక్క బిడ్డ మాత్రమే ఉండాలని, ఆపై తల్లి తండ్రులు ఎవరైనా కుటుంబ నిరయంత్రణ చేయించుకోవాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి ఆ దేశంలో జనాభా కొంతవరకు తగ్గుముఖం పట్టింది. ఇక గత 2016లో అక్కడి ప్రభుత్వం చేసిన చిన్న సడలింపుతో ఇంటికి ఇద్దరును కానవచ్చు అనే నూతన బిల్లు అమలు కావడంతో ప్రజలు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. అయినా కూడా అక్కడి లెక్కలు ప్రకారం చూస్తుంటే, కొన్నీ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి సెన్సెస్ అధికారులు చెపుతున్నారు. 2016 చివరినాటికి అక్కడ 230.8 మిళియన్లకంటే ఎక్కువ అక్కడ వృద్ధ జనాభా ఉందట. అంటే అది దేశ జనాభాలో 16.7 శాతమట.

అయితే అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఏదైనా ప్రపంచంలోని ఒక దేశ జనాభాలో 10 సాతంకంటే వృద్ధులు ఉంటే దానిని ఏజ్డ్ సొసైటీ గా పరిగణించడం జరుగుతుందట. ఇలా వృద్ధుల జనాభా పెరుగుతొంటే, అది ఆర్ధిక వ్యవస్థ మీద కూడా పెను ప్రభావం చూపుతోందని, అందువల్ల నూతన మరియు సరికొత్త సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా వుందని చెపుతున్నారు. అందువల్ల రానున్న రోజుల్లో అంటే 2050 నాటికి చైనా జనాభా భరత్ జనాభాలో 65 శాతానికి చేరుకుంటుందని వారు అంటున్నారు. అందువల్ల ఇప్పుడైనా చైనా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పద్దతులను ఎత్తి వేయాలని, ఒకవేళ అతిత్వరలో ఈ పద్దతిని అమలుచేయకపోతే మరింత మంది యువత కోరత కూడా వస్తుందట. భారత్ వంటి పెద్ద దేశం ఏ మాత్రం కుటుంబ నియంత్రణ పాటించడం లేదని, కావున తమ దేశంలో కూడా కుటుంబ నియంత్రణ ఎత్తివేయాలని అక్కడి ప్రజలు గట్టిగా కోరుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments