చింతమనేని పవన్ కు తన పవర్ చూపించాలనుకున్నాడా ?

Saturday, September 29th, 2018, 02:00:50 AM IST

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పవన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ పశ్చిమ గోదావరి టూర్ హాట్ హాట్ గా మారింది. ఆకు రౌడీ, చిల్లర రౌడీ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మీడియా సమక్షంలో ప్రజాస్వామ్యబద్దంగా కౌంటర్ ఇచ్చిన చింతమనేని ప్రభాకర్ మరొక దారిలో కూడ పవన్ కు తన పవర్ ఏమిటో చూపాలని అనుకున్నట్టున్నారు.

నిన్న బహిరంగ సభ తర్వాత రాత్రి పవన్ బస చేసిన ప్రాంతంలో కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. అక్కడే ఉన్న జనసేన కార్యక్రతలు, పవన్ అభిమానులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో పోలీసులకు చింతమనేని ఫోటోను స్టిక్కర్ రూపంలో అతికించి ఉన్న బైక్ దొరకడంతో అల్లరి చేసిన వారంతా చింతమనేని అనుచరులని, కావాలనే ఇలా చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఇక ఈరోజు పవన్ కొల్లేరు పర్యటనలో ఉండగా ఆయన నిర్వహించబోయే సభకు ఎవ్వరూ హాజరుకాకూడదని కొన్ని గ్రామాల్లో నిబంధనలు పెట్టారట స్థానిక పెద్దలు. నిబంధనలు అతిక్రమిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని బెదిరించారట. చింతమనేని ప్రోద్బలంతోనే గ్రామ పెద్దలు ఇలా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ బట్టి చింతమనేని నేరుగా తన పవర్ ఏంటో పవన్ ను చూపే ప్రయత్నాల్లో ఉన్నారనిపిస్తోంది. ఈ ప్రయత్నాలు ఏ మాత్రం హద్దులు దాటినా అభిమానుల నుండి చింతమనేని తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలానే జరిగితే ఈ మాటల యుద్ధం వర్గ పోరుగా మారే ప్రమాదం లేకపోలేదు.