చింతమనేని మరో సారి బూతు పురాణం..చంద్రబాబు వార్నింగ్ సంచలనం.!

Saturday, November 17th, 2018, 01:50:54 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు ఇప్పుడు సంచలనంగా మారుతుంది.ఆ మధ్య పవన్ కు మరియు చింతమనేనికి మాటల యుద్ధం జరగడంతో అతని పేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యిందన్నది కూడా వాస్తవం.ఇప్పటికే చింతమనేని మీద ఎన్నో ఆరోపణలు కేసులు ఉన్నాయి.కులం పేరుతో దూషిస్తాడని,అవసరమైతే భౌతికంగా కూడా దాడి చేస్తాడని అక్కడి ప్రజల మాట,ఆ మధ్య మీడియా మిత్రుల మీద కూడా అతని బూతుపురాణం సంచలనానికి దారి తీసింది,ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సంఘటనే వేంపాడులోని చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

వేంపాడు మాజీ సర్పంచ్ అయినటువంటి రంగారావు అనే వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాకుండా అతని మీద చెయ్యి కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి అక్కడ కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తగుల బెట్టి వారి నిరసనను తెలియజేసారు.దీనితో అక్కడి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని తెలుసుకున్నటువంటి చంద్రబాబు చింతమనేని వైఖరి మార్చుకోవాలని,ఇదే తీరు గాని అక్కడ కొనసాగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని,పార్టీని అక్కడ దిగజార్చిద్దని అతనికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.దీనితో చింతమనేని అక్కడికి వెళ్లి క్షమాపణ కోరినట్టు తెలుస్తుంది.