షాకింగ్ : సైరా పై చిరంజీవి అసంతృప్తి..?

Friday, November 16th, 2018, 01:00:16 PM IST

దాదాపు ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150 లాంటి హిట్ తో రి -ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహ రెడ్డి, 200కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేయాలన్న లక్ష్యం తో తీస్తున్న ఈ సినిమా అవుట్ ఫుట్ పై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారంటూ గాసిప్ లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి తరచూ అసహనాన్ని ప్రదర్శిస్తుండటమే అంట.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, సినిమా మొదలైనప్పటి నుండి ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ చరణ్ దగ్గరుండి చూసుకునేవారట. తర్వాత ఆయన వినయ విధేయ రామ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల చిరంజీవి షూటింగ్ తో పటు నిర్మాణ వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తుందట. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణ పనుల్లో జరుగుతున్న పొరపాట్ల పై షూటింగ్ స్పాట్ లో సిబ్బంది పై కోప్పడ్డారట. సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి పై కూడా కోపగించిన విషయం స్వయానా సురేందర్ రెడ్డే చరణ్ వద్దకు తీసుకెళ్లారట.,పని ఒత్తిడి, పెరుగుతున్న వయసు ప్రభావం వల్ల చిరంజీవి ఇటు నటన, అటు నిర్మాణ వ్యవహారాలు చూసుకోలేక అసహనానికి లోనవుతున్నారని ఇన్సైడ్ టాక్. అయితే, చిరంజీవి ఒత్తిడి వల్లే అలా ప్రవర్తిస్తున్నారు? లేక సినిమా అవుట్ ఫుట్ ఆయనకు నచ్చటం లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటె, మెగా కాంపౌండ్ మాత్రం ఈ గాసిప్ లను కొట్టి పడేస్తున్నారు, మెగా ఫామిలీ అంటే గిట్టని వారు పని కట్టుకు ఇలాంటి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్తున్నారు.