అన్నయ్య పాలిటిక్స్ బ్రేక్.. తమ్ముడు సినిమా బ్రేక్!

Sunday, March 11th, 2018, 04:20:22 PM IST

రాజకీయలకు సినీ తారలకు చాలా దగ్గరి సంబంధం ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. గత కొంత కాలంగా ఈ రెండు క్యాటగిరీలకు సంబందించిన వారు జనాల్లో భారీగా అభిమానులను సంపాదించుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎంత మంది అభిమానులను సంపాదించుకున్న మెగా బ్రదర్స్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి సరికొత్తగా వెళుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ ఎవరు ఊహించని విధంగా అడుగుపెట్టి ఊహించని విధంగా దెబ్బ తిన్నారు. సినిమాల పరంగా ఆదరించిన ఆయన్ను జనాలు రాజకీయ నాయకుడిగా నమ్మలేకపోయారు.

దీంతో చీరంజీవి ప్రజారాజ్యం పార్టీని కొన్నేళ్ల వరకు కూడా నడపకుండా కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలను తీసుకున్నప్పటికీ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అన్నయ్య తరహాలో కాకుండా కుట్ర రాజకీయాల్లో కొంచెం డిఫెరెంట్ గా అడుగులు వేశారు. డైరెక్ట్ గా ఎన్నికల బరిలో తీగకుండా తనదైన శైలిలో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన తప్పులు ఇక్కడ కొంచెం కూడా రిపీట్ అవ్వకూడదని వెళుతున్నాడు.

అయితే ఇప్పుడు ఇద్దరి దారులు వేరైనా టార్గెట్ మాత్రం ఒక్కటే అనే విధంగా రాజకీయాల్లో ప్రయాణిస్తున్నారు. కానీ పవన్ స్థాయిలో చీరంజీవి రెగ్యులర్ పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు. ఆయన జీవిత కాలం కాంగ్రెస్ లోనే ఉంటానని తెలిపారు. కానీ ప్రస్తుతం ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఆయన అంతగా స్పందించడం లేదు. కాంగ్రెస్ నేతలు సౌండ్ కూడా ఎక్కువగా లేదు. ఇకపోతే పవన్ మాత్రం ప్రత్యేక ఆలోచనలతో అవగాహన ఉన్న ప్రముఖులతో కమిటీలను ఏర్పరచి ముందుకు వెళుతున్నాడు.

ఫైనల్ గా ఇప్పుడు మెగా బ్రదర్స్ లో ఒకరు రాజకీయాలకు దూరమవుతుంటే మరొకరు సినిమాలకు దూరమవుతున్నారు. చీరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమా కోసం కష్టపడుతున్నాడు. కానీ పవన్ మాత్రం ప్రస్తుతానికి సినిమాలపై ఆలోచన అలాగే సమయం లేదని గట్టిగా చెప్పేశాడు. చూస్తుంటే పవన్ 2019 ఎలక్షన్స్ వరకు ఏ సినిమాను ఒకే చేసే అవకాశం లేదనే టాక్ వస్తోంది. పవన్ కూడా మీడియా సమావేశాల్లో క్లారిటీ ఇచ్చాడు. ఈ విధంగా అన్నయ్య పాలిటిక్స్ కి బ్రేక్ ఇస్తుంటే.. తమ్ముడు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడు. ఇక ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులో పవన్ నిర్వహించనున్నారు. ఆ రోజు పవన్ తన అసలైన రాజకీయ ప్రణాళికలను తెలియజేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments