నిలకడగా జగన్ ఆరోగ్యం – చిరంజీవి పరామర్శ

Saturday, October 27th, 2018, 10:57:56 PM IST

విశాఖ ఎయిర్పోర్ట్ లో కత్తి దాడి లో గాయపడ్డ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం నిలకడ గా ఉందని వైద్యులు తెలిపారు. జగన్ కు సిటీ న్యూరో హాస్పిటల్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించిందని ఆయన ఆరోగ్యం నిలకడ గా ఉందని హాస్పిటల్ ఎమ్. డి సాంబ శివారెడ్డి తెలిపారు.గాయం తీవ్రత కారణంగా వారం రోజుల పాటు జగన్ ను విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సూచించారు, గాయం నుండి సేకరించిన రక్త నమూనాలు ల్యాబ్ కు పంపగా వచ్చిన రిపోర్ట్స్ లో రక్తం లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించడమైనది సాంబశివారెడ్డి తెలిపారు.

శుక్రవారం డిశ్చార్జ్ అయిన జగన్మోహన్ రెడ్డి ని శనివారం మెగాస్టార్ చిరంజీవి ఫోన్ లో పరామర్శించారు, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదివరకే ప్రధాని మోడీ గవర్నర్ ద్వారా జగన్ ఆరోగ్య వివరాలను , రాష్ట్రంలో నెలకొన్నపరిస్థితి గురించి తెలుసుకున్నారు.జగన్ ను పరామర్శించిన ప్రముఖుల్లో కొణిజేటి రోశయ్య, సిపిఐ జాతీయ ప్రదాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.