పవన్ కంటే చిరునే ముందున్నారట!

Saturday, December 20th, 2014, 09:52:11 AM IST

pawan-kalyan-and-chiranjeev
సహజంగా తెలియని విషయాలగురించి గాని, ప్రముఖుల గురించి గాని తెలుసుకోవాలంటే ఈ శతాబ్దం వారు ఎక్కువగా నమ్ముకునేది గూగుల్ మాతనే. ఇక తమ ఇష్టమైన సెలబ్రిటీస్ గురించి నెట్ లో గూగుల్ సెర్చ్ చెయ్యనివారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే 2004 నుండి 2014 వరకు నెట్ లో అత్యధికంగా వెతకబడ్డ టాలివుడ్ సెలబ్రిటీస్ లో మెగా బ్రదర్స్ టాప్ 5 లో నిలిచారట.

ఇక సినిమాలలో తన సత్తా చాటుకుని అటుపై రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజరాజ్యం పార్టీని స్థాపించి అటుపై దానిని కాంగ్రెస్ లో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవి అత్యధికంగా సెర్చ్ చెయ్యబడిన టాలీవుడ్ సెలబ్రిటీస్ లో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే తన పేరు పైన ఏకంగా ఒక ఇజాన్నే ఏర్పాటు చేసేంతగా అభిమానుల మనసులను కొల్లగొట్టి, అత్యధిక క్రేజ్ సంపాదించుకుని, ఇటీవల ఎన్నికల కాలంలో జనసేన పార్టీని స్థాపించి, టిడిపి-భాజపా పొత్తుకు మద్దతు నివ్వడం ద్వారా ఆ పార్టీల విజయానికి తనవంతు సహకారం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెటిజన్ల సెర్చ్ లో 5వ స్థానాన్ని పొందారట. అయితే ఇందులో మరి అన్నగారు తమ్ముడు కన్నా ఒక అడుగు ముందున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రధమ స్థానంలో అత్యధికంగా సెర్చ్ చెయ్యబడిన వ్యక్తిగా ప్రిన్స్ మహేష్ బాబు నిలవగా, రెండవ స్థానంలో అల్లు అర్జున్, మూడవ స్థానంలో ప్రభాస్ ఉన్నారని తెలుస్తోంది.