జనసేన సలహాదారుడిగా చిరు – హాట్ టాపిక్..!

Saturday, November 10th, 2018, 03:02:22 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన పొలిటికల్ కెరీర్ లో కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారా? తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారా? బద్ద శత్రువైన టీడీపీ తో కాంగ్రెస్ చేతులు కలపటం ఆయనకు కూడా నచ్చలేదట, కాంగ్రెస్ అనైతిక చర్యను నిరసిస్తూ అయన పార్టీకి రాజీనామా సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఈ విషయం మీద చిరు ఒక క్లారిటీ ఇస్తారట. తమ్ముడి పార్టీలోకి వెళ్ళటం కోసమే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తున్నారంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సిద్ధాంతాలను తుంగలో తొక్కి మరీ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవటం పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ సీనియర్ నాయకులూ ఒక్కొక్కరుగా పార్టీ కి రాజీనామా చేస్తున్నారు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, బాల రాజు, మాజీ ఎంపీ సి. రామచంద్రయ్య ఇప్పటి వరకు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అయితే ఇంకా బయటపడని వారు చాలా మంది ఉన్నారు, వీరిలాగే చిరంజీవి కూడా టీడీపీ కాంగ్రెస్ ల కలయిక పై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం, అందుకే పార్టీ ని వీడబోతున్నారట,అయితే దీని పై చిరంజీవి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఈ నెలలోనే క్లారిటీ ఇస్తారని సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో చిరు పొలిటికల్ కెరీర్ కూడా ముగిసినట్టే అని చాలా మంది అభిప్రాయం పడ్డారు. అయితే తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ ను వీడి, తమ్ముడి పార్టీ అయిన జనసేనకు చిరు సేవలు అందించే ఆలోచనలో ఉన్నట్టు, అంతే కాకుండా జనసేన సలహాదారుగా ఉండబోతున్నారని కొంత మంది జోస్యం చెప్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments