శేఖ‌ర్‌బాబు కుటుంబ‌స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించిన చిరు!

Saturday, February 25th, 2017, 11:08:46 AM IST


నేటి తెల్ల‌వారు ఝామున నిర్మాత కె.సి. శేఖ‌ర్‌బాబు(74) గుండెపోటుతో మృతి చెందిన‌ సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి స‌హా బాల‌కృష్ణ‌, కృష్ణ‌, కృష్ణంరాజు వంటి స్టార్ల‌తో సినిమాలు నిర్మించారాయ‌న‌. అయితే ఆయ‌న ఆక‌శ్మిక మృతిప‌ట్ల తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లి సంతాపం ప్ర‌క‌టించింది. వారి కుటుంబ స‌భ్యుల‌కు నిర్మాత‌లంతా త‌మ ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్త‌ప‌రిచారు. జ‌ర్న‌లిస్ట్ కాల‌నీలోని శేఖ‌ర్‌బాబు ఇంటివ‌ద్దకు ప‌లువురు సినీప్ర‌ముఖులు హాజ‌రై కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి శేఖ‌ర్‌బాబు భౌతిక‌ఖాయాన్ని సంద‌ర్శించి, అనంత‌రం వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. మెగాస్టార్‌తో శేఖ‌ర్‌బాబు `ముఠామేస్త్రి` చిత్రం తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.