మోడీకి ‘సైరా’ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత!

Wednesday, July 25th, 2018, 12:39:13 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో అంశం వైరల్ అవుతూనే ఉంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా విషయాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు టీడీపీ కూడా నిత్యం పోరాడుతూనే ఉన్నామంటూ చెబుతోంది. పార్లమెంట్ ముందు ఎంపీలు కూడా నిరంతరం నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ రోజుతో వారి పోరాటం 33వ రోజుకి చేరింది. ఇకపోతే ప్రతిసారి ఎంపిలలో డిఫరెంట్ గా కనిపించే చిత్తూరు ఎంపి నరమల్లి శివప్రసాద్ ఈ సారి మరింత కొత్తగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషంలో వచ్చి ‘సైరా… నరసింహారెడ్డి’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అన్నమయ్యగా మత్స్యకారుడిగా, చాకలిగా ఆలాగే ఓ మహిళగా, స్కూలు బాయిగా కనిపించి వినూత్నంగా నిరసనలు తెలిపారు. ఇక ఇప్పుడు ఏపికి ఇచ్చిన హామీలను ప్రత్యేక హోదా తో పాటు రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటిని వెంటనే అమలు చేయాలనీ లేకుంటే తన కరవాలానికి నరసింహంహారెడ్డి పని చెబుతాడని హెచ్చరిక జారీ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments