ఎన్నారై మీటింగులో చంద్రబాబు చెప్పిన మాటలు ఇవే.!

Thursday, May 16th, 2019, 10:46:32 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఉండవల్లిలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్రుల కాన్ఫిరెన్స్ మీటింగులో కొన్ని కీలక అంశాలు చర్చించారు.జన్మభూమి మరియు స్మార్ట్ వార్డ్ వంటి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.అలాగే మనం ధర్మం కోసం పోరాటం చేశామని చివరకు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని తెలిపారు.ప్రతీ ఒక్కరూ స్వగ్రామం,స్వరాష్ట్రం,స్వదేశం అనే నినాదంతో ముందుకు సాగిపోవాలి అని..

జేఈఈ మైన్స్ లో మొదటి బాలుడు ర్యాంకులు మన రాష్ట్రానికే వచ్చాయని ఇక్కడి తెలుగు విద్యార్థుల ప్రతిభకు ఇదే నిదర్శనం అని తెలియజేసారు.ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉండాలని పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ప్రతీ ఒక్కరూ ఓ పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు.పాఠశాలలు నీటి వనరులులో కూడా అద్భుత పురోగతి మనం కనబర్చామని తెలిపారు,ఇక అలాగే వ్యవసాయ రంగంలో కూడా వృద్ధి రేటును తగ్గకుండా చూశామని మొత్తం 150 దేశాల్లో 25 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారని అందరు ఏపీ అభివృద్ధికి భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు తెలిజేశారు.