వీడియో : లోకల్ సాంగ్ లో గేల్ స్టెప్పులు చూశారా?

Monday, April 23rd, 2018, 05:00:37 PM IST

తేరీ ఆక్యా కా యో కాజల్‌ అనే హర్యానా పాట ఎంతగా పాపులర్ అయ్యిందో చాలా మందికి తెలిసే ఉంటుంది. నార్త్ లో ఆ పాట గత కొంత కాలంగా వైరల్ అవుతోంది. ఎలాంటి వేడుకలు జరిగిన ఆ పాట వినిపించాల్సిందే. సింగర్‌ వీర్‌ దహియా పాడిన ఆ పాట సౌత్ లో కూడా ఈ మధ్య వినిపిస్తోంది. చాలా వరకు సినిమా స్టార్స్ కూడా అప్పుడపుడు తేరీ ఆక్యా కా యో కాజల్‌ అంటూ ఎవరి స్టైల్ లో వారు చిందులు వేస్తున్నారు.

అయితే భారతీయ పాటలను ఎక్కువగా ఇష్టపడే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఆ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కరేబియన్ వీరుడి స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయని అభిమానులు తెగ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలంలో ఎవరు కొనుగోలు చేయకపోతే చివరగా 2 కోట్లకు పంజాబ్ అతన్ని టీమ్ లో చేర్చుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments