వీడియో :పంజాబీ స్టెప్స్ తో దుమ్ములేపుతున్న గేల్…

Sunday, April 1st, 2018, 04:17:14 PM IST

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గేల్ ఫీల్డ్‌లో ఉన్నా బయట ఉన్నా.. అతని చుట్టూ ఉన్నవాళ్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా ఉండదు. ఎప్పుడూ చిందులు వేస్తూనే ఉంటాడు. ఫీల్డ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించే గేల్.. అదే రేంజ్‌లో ఎంజాయ్ చేస్తాడు. డ్యాన్స్‌లతో హోరెత్తిస్తాడు. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్‌లో ఈసారి గేల్ కింగ్స్ పంజాబ్ టీమ్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో అతను అప్పుడే ఆ మూడ్‌లోకి వెళ్లిపోయాడు.పంజాబీలలో కలిసిపోయి ఆ ప్రదేశపు మనిషిలా పంజాబీ పాటలో డాన్స్ ఆదరగోడుతున్నాడు.

ఓ బోట్‌లో షికారు చేస్తున్న సమయంలో పంజాబీ సాంగ్‌కు భాంగ్రా స్టెప్పులేస్తూ గేల్ ఎంజాయ్ చేశాడు. ఐపీఎల్ వేలంలో అతనిపై ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చివరిగా అతని కనీస ధర అయిన రూ.2 కోట్లకే కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఆడిన గేల్.. మంచి ఫామ్‌లో ఉన్నాడు. యూఏఈపై సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్‌లో అయితే అతనికి తిరుగులేని రికార్డుంది. మొత్తం 101 మ్యాచుల్లో 151 ైస్ట్రెక్‌రేట్‌తో 3626 రన్స్ చేశాడు. అందులో 5 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొదట కోల్‌కతాకు, తర్వాత బెంగళూరుకు, ఇప్పుడు కింగ్స్ పంజాబ్‌కు టీమ్‌కు గేల్ ఆడుతున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments