క్రిస్ గేల్ మెరుపు సెంచరీ!

Friday, April 20th, 2018, 01:27:07 AM IST


గత కొద్దికాలంగా ఐపీఎల్ లో తన సత్త చూపించలేకపోయిన వెస్ట్ ఇండీస్ స్టార్ బ్యాట్స్ మాన్ క్రిస్ గేల్. నేడు తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 58 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 సిక్సులు, ఒకే ఒక ఫోర్ ఉండటం విశేషం. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు ఓపెనర్లు సన్‌రైజర్స్ కట్టుదిట్టమై బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. కాగా రషీద్ ఖాన్ వేసిన 8వ ఓవర్‌ ఐదో బంతికి రాహుల్(18) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఈ నేపథ్యంలో క్రిస్ గేల్ జట్టుకు అండగా నిలిచాడు. తనదైనశైలి దూకుడైన ఆటతో మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సులు కొట్టిన గేల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6 సెంచరీలు నమోదు చేశాడు. మరోవైపు కరుణ్ నైర్(31), ఆరోన్ ఫించ్(14) స్కోర్ బోర్డుని పెంచడంలో తమ వంతు సహకారం అందించారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. నస్‌రైజర్స్ బౌలింగ్‌లో భువనేశ్వర్, రషీద్, కౌల్ చెరో వికెట్ తీశారు…..

  •  
  •  
  •  
  •  

Comments