సిక్సుల్లో క్రిస్ గేల్ సరికొత్త రికార్డ్!

Monday, July 30th, 2018, 03:00:18 PM IST

ప్రపంచంలోనే అతి విద్వాంసకర బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ ఆటగాడు గత కొంత కాలంగా ఫామ్ లో లేడనే విమర్శలు బాగా వచ్చాయి. అంతే కాకుండా అతని బలం కూడా చాలా వరకు తగ్గిందని కామెంట్స్ వస్తున్న తరుణంలో క్రిస్ గేల్ తన ప్రతాపాన్ని చూపించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఆఫ్రిది పక్కన చేరాడు. ఇటీవల బాంగ్లాదేశ్ తో జరిగిన మూడవ వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయంలో గేల్ పాత్ర ఎంతో ఉంది. 66 బంతుల్లో 72 పరుగులు చేసిన గేల్ 6 ఫోర్లు 5 సిక్సర్లు బాదాడు. ఇప్పటివరకు ఈ ఆటగాడు 476 సిక్సులు కొట్టాడు. వన్డేల్లో ముందే పాకిస్తాన్ ప్లేయర్ ఆఫ్రిది ఈ మార్క్ ను అందుకున్నాడు. ఇప్పుడు గేల్ అతనితో సమానంగా నిలిచాడు.

ఇక ఇప్పటివరకు మొత్తంగా వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి లిస్టు చుస్తే….

క్రిస్ గేల్ – ఆఫ్రిది (476)
బ్రెండన్‌ మెకల్లమ్‌(398)
సనత్‌ జయసూర్య(352)
ఎంఎస్‌ ధోని(342)
ఏబీ డివిలియర్స్‌(328)
రోహిత్‌ శర్మ(291)
మార్టిన్‌ గప్టిల్‌(274)
సచిన్‌ (264)

  •  
  •  
  •  
  •  

Comments