అమ్మాయిలకు దెయ్యం పట్టడం వల్లే ఆ డ్రెస్సులు వేసుకుంటున్నారట !

Tuesday, February 28th, 2017, 09:31:27 AM IST


భారత యువతీ యువకుల్లో వెస్ట్రన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఈ విషయం పై పలువురు ప్రముఖులు వివాద స్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. పురుషులను రెచ్చగొట్టేలా మహిళలు డ్రెస్సులు ధరించడం పద్ధతి కాదని ఓ క్రిస్టియన్ మత ప్రభోధకుడు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఓ చర్చిలో ప్రసంగిస్తూ పాస్టర్ సెర్మోన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తనకు బోధనలు చేయాలంటే ఇబ్బందిగా ఉంటోందని ఆయన అన్నారు. తాను బోధనలు చేసే సమయంలో యువతులు మోడ్రన్ దుస్తుల్లో ముందువరుసలో కూర్చుంటున్నారని ఆయన అన్నారు. చేతిలో మొబైల్ పట్టుకుని వారు అలా కూర్చోవడం తనకు నచ్చదని సెర్మోన్ అన్నారు. కనీసం జుట్టుకూడా సరిగా దువ్వుకుని రారని ఆయన అన్నారు. చర్చికి వచ్చే సమయంలో ఇలా ఎందుకు చేస్తారో తనకు అర్థం కాదని ఆయన అన్నారు.

చర్చిలోకి అలాంటి దుస్తులతో రావచ్చా అని అక్కడ ఉన్నమహిళలను ఆయన ప్రశ్నించారు. కొంత మంది అబ్బాయిలు కూడా యువతుల దుస్తులపై తనకు ఫిర్యాదు చేసినట్లు సెర్మోన్ అన్నారు. అమ్మాయిలను అలాంటి దుస్తుల్లో చూడడం వల్ల పాపాలకు గురవుతున్నామని అబ్బాయిలు తనతో చెప్పినట్లు సెర్మోన్ అన్నారు. మహిళలు తమకు ఉద్యోగం రావడం లేదని, పెళ్లిళ్లు జరగడం లేదని భాదపడుతూంటారని అన్నారు. దానికి కారణం వారు ధరిస్తున్న దుస్తులే అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత మంది అమ్మాయిలకు సైతాన్ పట్టింది.. అందుకే మోడ్రన్ దుస్తులపట్ల ఆకర్షితులవుతున్నారు అంటూ పాస్టర్ సెర్మోన్ వ్యాఖ్యానించారు.