కాకినాడ ఎందుకు వెళ్లారు.. భూమన పై ప్రశ్నల వర్షం..!

Wednesday, September 21st, 2016, 08:37:25 AM IST

bhumana-y
వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పై సిఐడి మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 8 గంటల సుదీర్ఘ సమయం సిఐడి ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. భూమన ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు లోని సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటలవరకు సిఐడి ఆయనను ప్రశ్నించింది.

కాపుగర్జనకు ముందు ముద్రగడని ఎందుకు కలిసారని, కాపు గర్జనలో వాడిన డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయని తెలుస్తోంది.కాపు గర్జన సభకు ముందు కాకినాడ ఎందుకు వెళ్లారని భూమన ని సిఐడి అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.భూమన అనుచరుడు కాకినాడకు చెందిన మెహర్ కుమార్ ను కూడా సిఐడి విచారించింది.భూమనకు, కాపు గర్జనకు సంభందించిన కీలక సమాచారాన్ని సిఐడి మెహర్ నుంచి రాబట్టినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ జోడించి సిఐడి భూమన అరెస్టు పై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అవసరమైతే మరో మారు కూడా భూమనని విచారణకు హాజఋ కావాలని ఆదేశించినట్లు సమాచారం.సభాస్థలాన్ని భూమన, ముద్రగడ కలసి ఎంపిక చేశారని సిఐడి అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.